అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను శనివారం ఎంఈవో శ్రీధర్ (MEO Sridhar) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం (midday meals) బాగా పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడి రుచికరమైన వంట చేసి విద్యార్థులకు అందించాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.