72
అక్షరటుడే,బోధన్ : School Games | క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) పేర్కొన్నారు. బోధన్ పట్టణ శివారులోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో (Minority Residential Girls’ School) మైనారిటీ సొసైటీ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
School Games | ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలి..
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో మైనారిటీ సొసైటీ ప్రతినిధులు, పాఠశాల హెచ్ఎం పద్మజ (School HM Padmaja), పీఈటీ గీత, తదితరులు పాల్గొన్నారు.