అక్షరటుడే, ఇందూరు: Chess Association | చెస్ ఆడటం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని ప్రముఖ వైద్యులు రాజేందర్ సూరి నాయుడు (doctor Rajender Suri Naidu) తెలిపారు. చెస్ అసోసియేషన్ (Chess Association) ఆధ్వర్యంలో శుక్రవారం అభ్యాస పాఠశాలలో జిల్లాస్థాయి అండర్–15 బాల బాలికల చెస్ టోర్నీ (boys and girls chess tournament) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి విద్యతోపాటు ఏదో ఒక క్రీడలో రాణించాలని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ విజేతలుగా నిలబడాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రమేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే: బాలుర విభాగంలో.. మొదటి స్థానంలో అభిజిత్ (అభ్యాస పాఠశాల), రెండో స్థానంలో శివానంద (కేంద్రీయ విద్యాలయం) నిలిచారు. బాలికల విభాగంలో మొదటి స్థానంలో సహస్ర (ఎస్ఆర్ ప్రైం) రెండో స్థానంలో మనస్వి (వీపీఎస్) నిలిచారు.