అక్షరటుడే, ఇందూరు: World Mental Health Day | మానసిక ఆరోగ్యమే మనిషికి మహాబలమని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ (Rotary Club Nizamabad), ధర్మాబాయి చారిటబుల్ ట్రస్ట్ (Dharmabai Charitable Trust) సంయుక్త ఆధ్వర్యంలో ఖలీల్వాడిలో (Khalelwadi) డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో (Drug de-addiction center) శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోజువారి దినచర్యలో వ్యాయామం చేస్తూ.. పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ప్రధానంగా మద్యపానం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మానసిక ప్రశాంతతకు మనుషుల మధ్య ఉంటూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని తెలిపారు.
అవసరానికి మించి చరవాణి వినియోగించొద్దని చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు శ్యాంసుందర్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, సభ్యులు సతీష్ షా, రామకృష్ణ, రత్నాకర్, బాబు తదితరులు పాల్గొన్నారు.