అక్షరటుడే, ఆర్మూర్: Sub Collector Abhigyan Malviya | విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల మానసిక వికాసం కలుగుతుందని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్వాన్ మాల్వియా (Armoor Sub Collector Abhigyan Malviya) అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే జూనియర్, డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం ఆటలు ఆడడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందన్నారు. ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రీడలు సైతం జీవింలో భాగం కావాలన్నారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
