ePaper
More
    HomeసినిమాTanvi The Great | ఆటిజం బాధితుల్లో మనో ధైర్యం.. హైదరాబాద్‌లో తన్వి ది గ్రేట్...

    Tanvi The Great | ఆటిజం బాధితుల్లో మనో ధైర్యం.. హైదరాబాద్‌లో తన్వి ది గ్రేట్ ప్రత్యేక ప్రదర్శన

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Tanvi The Great | ఆటిజంతో బాధపడుతున్న వారిపట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో టాటా పవర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (TPCDT) హైదరాబాద్‌లో “తన్వి ది గ్రేట్” ప్రత్యేక చిత్ర ప్రదర్శనను నిర్వహించింది.

    అనుపమ్ ఖేర్ స్టూడియో(Anupam Kher Studio)తో కలిసి, టాటా పవర్ చేపట్టిన ‘పే అటెన్షన్’ కార్యక్రమం కింద ఈ ఈవెంట్ జరిగింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు న్యూరోడైవర్స్ వ్యక్తులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు, నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులతో సహా 350 మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, పే అటెన్షన్ సెన్సరీ ఎక్స్‌పీరియన్స్ జోన్‌(Pay Attention Sensory Experience Zone)ను ఏర్పాటు చేశారు. న్యూరోడైవర్స్ దృక్పథం నుంచి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని హాజరైనవారిలో కల్పించింది.

    READ ALSO  Actress Esha Koppikar | నాగార్జున 14 సార్లు కొట్టాడు.. న‌టి ఈషా కొప్పిక‌ర్ వెల్ల‌డి

    ఈ సందర్భంగా టాటా పవర్ సీహెచ్ఆర్వో & చీఫ్ సస్టైనబిలిటీ & సీఎస్ఆర్ హిమాల్ తివారీ(CSR Himal Tiwari) మాట్లాడుతూ.. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులను భిన్నంగా చూడటం కాకుండా, ప్రతి ఒక్కరి ప్రత్యేకతను అంగీకరించడమే నిజమైన సమగ్రత అని అన్నారు. దేశ మొట్టమొదటి భౌతిక, డిజిటల్ న్యూరోడైవర్సిటీ సపోర్ట్ నెట్‌వర్క్ అయిన ‘పే అటెన్షన్’ కార్యక్రమం ద్వారా అందరినీ కలుపుకుపోయే ప్రపంచాన్ని నిర్మించడానికి టాటా పవర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. “తన్వి ది గ్రేట్”(Tanvi the Great) తనకు ఎంతో ఇష్టమని.. తన మేనకోడలు తన్వి నుంచి ప్రేరణ పొంది తీసిన చిత్రమని తెలిపారు. ఆటిజం(Autism) కలిగిన అనేక మందిలాగే, ఆమె కూడా ప్రతిభ, సామర్థ్యం ఉన్న వ్యక్తి అని ఆయన తెలిపారు. ఈ కథ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను చేరినప్పుడే నిజమైన విజయం లభిస్తుందని ఖేర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

    READ ALSO  National Awards | 71వ నేష‌న‌ల్ అవార్డ్స్.. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్‌ కేసరి”.. హనుమాన్, బలగం సినిమాలకు కూడా అవార్డులు

    Tanvi The Great | సినిమా గురించి..

    “తన్వి ది గ్రేట్” అనేది ఒక యువ న్యూరోడైవర్స్(Neurodiverse) అమ్మాయి తన కలను చేరుకోవడానికి సామాజిక పరిస్థితులు, పరిమితులను ధిక్కరించే శక్తివంతమైన చిత్రం. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తుల సవాళ్లు, బలాలను సున్నితంగా వివరిస్తూ తీసిన సినిమా ఇది.

    Latest articles

    Rahul Gandhi | ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | దేశంలో ఎన్నికల నిర్వహణపై లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ...

    Municipal corporation | తడిపొడి చెత్తను వేరుగా వేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal corporation | తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని, ప్రతి ఇంట్లో పరిశుభ్రత పాటించాలని...

    IVF Centers | ‘సృష్టి’ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం.. ఐవీఎప్​ సెంటర్ల తనిఖీలకు ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IVF Centers | సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం(State...

    Anasuya Bharadwaj | చెప్పు తెగుద్ది అంటూ యువ‌కుల‌కు అన‌సూయ వార్నింగ్.. మీ వ‌ల్ల స‌మాజానికి ఉప‌యోగం లేదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anasuya Bharadwaj | ప్రముఖ టెలివిజన్ యాంక‌ర్, నటి అనసూయ భరద్వాజ  తాజాగా ఓ సంఘటనపై...

    More like this

    Rahul Gandhi | ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | దేశంలో ఎన్నికల నిర్వహణపై లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ...

    Municipal corporation | తడిపొడి చెత్తను వేరుగా వేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal corporation | తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని, ప్రతి ఇంట్లో పరిశుభ్రత పాటించాలని...

    IVF Centers | ‘సృష్టి’ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం.. ఐవీఎప్​ సెంటర్ల తనిఖీలకు ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IVF Centers | సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం(State...