Homeజిల్లాలునిజామాబాద్​Mendora Police | క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం

Mendora Police | క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం

క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కలుగుతుందని ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డి, సీఐ శ్రీధర్​ రెడ్డి పేర్కొన్నారు. మెండోరా పోలీసుల​ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్​ టోర్నీలో విజేతలకు బహుమతులు అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా: Mendora Police | క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఏసీపీ వెంకటేశ్వర్​రెడ్డి (ACP Venkateswar Reddy), సీఐ శ్రీధర్​ రెడ్డి పేర్కొన్నారు. మెండోరా పోలీసుల ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోచంపాడు గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ (volleyball tournament) నిర్వహించారు.

ఈ టోర్నీని వారిరువురు ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. టోర్నీలో అధిక సంఖ్యలో యువతీయువకులు పాల్గొనడం అభినందనీయమన్నారు. మత్తు పదార్థాల వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. మెండోరా ఎస్సై సుహాసిని ఆధ్వర్యంటో ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించడంపై అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌లో విజేతలైన జట్లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Must Read
Related News