HomeUncategorizedUttar Pradesh | పురుషులు మేల్కొండి..! ద‌గ్గ‌రుండి ఇద్ద‌రు యువతులకు పెళ్లి చేయించిన న్యాయ‌వాదులు

Uttar Pradesh | పురుషులు మేల్కొండి..! ద‌గ్గ‌రుండి ఇద్ద‌రు యువతులకు పెళ్లి చేయించిన న్యాయ‌వాదులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh | లోకం ఎటు పోతుందో ఎవరికి అర్ధం కావ‌డం లేదు. ఎన్నో వింత‌లు, విచిత్రాలు చూడాల్సి వ‌స్తుంది. సాధార‌ణంగా మ‌న సంప్ర‌దాయం ప్ర‌కారం అమ్మాయిలు, అబ్బాయిలు క‌లిసి పెళ్లి చేసుకుంటారు. కానీ ఇప్పుడు పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు మనుషుల ఆలోచనలు మారి పోవ‌డంతో ఇద్ద‌రు అమ్మాయిలు లేదా ఇద్ద‌రు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లోని బదౌన్‌లో ఓ వింత విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన వాళ్ల చేతిలో మోసపోయామన్న కారణంతో ఓ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు మహిళల పెళ్లి Marriage న్యాయవాదుల సమక్షంలోనే జ‌ర‌గడం విశేషం.

Uttar Pradesh | ఇలా అయితే ఎలా?

ఉత్తర ప్రదేశ్, బదౌన్ ‌కు చెందిన మీనా(Meena), స్వప్న(Swapna) అనే ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీలోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు. ఒకే ఆఫీసులో పనికావడంతో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరి పర్సనల్ విషయాలు మరొకరితో పంచుకునే వారు. ఈ నేపథ్యంలోనే తమ లవ్ ఫెయిల్యూర్స్ గురించి కూడా చర్చించుకున్నారు. ఈ ఇద్దరూ గతంలో ఫేస్‌బుక్(Facebook) ద్వారా ఓ ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమించగా, వారితో కొన్నేళ్ల పాటు లవ్‌లో ఉన్నారు. ఆ ఇద్దరు మగాళ్లు వీరిని మోసం చేశారు. ఆ మోసాన్ని వీరు తట్టుకోలేకపోయారు. ఇద్ద‌రిది ఒకే అనుభవం కావ‌డంతో ద‌గ్గ‌ర‌య్యారు. ఇక వీరి స్నేహం ప్రేమ‌గా మారింది. మ‌ళ్లీ మ‌గాళ్ల కారణంగా మోసపోవడం ఇష్టం లేదు కాబట్టి.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

తాజాగా, ఓ గుడిలో వారిద్ద‌రూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. న్యాయ‌వాదులు(Lawyers) ద‌గ్గ‌రుండి వీరి వివాహం జ‌రిపించ‌డం విశేషం. ఈ సందర్భంగా మీనా Meena మాట్లాడుతూ.. ‘మగాళ్లను నమ్మడానికి వీళ్లేదు కాబట్టి.. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిశ్చ‌యించుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. మగాళ్లు లేకుండా తాము బతికి చూపిస్తామని ఇద్దరూ అంటున్నారు. అంద‌రూ ఇలా చేసుకుంటూ పోతే స‌మాజం ఎటు పోతుంది. ఈ మ‌ధ్య ఇలాంటి పెళ్లిళ్లు మామూలు అయిపోయాయి. ఇలాంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉందా? లాయర్లు ఇలా చేస్తే ఎలా? అని పలువురు నెటిజన్లు ప్ర‌శ్నిస్తున్నారు.

Must Read
Related News