అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆర్మూర్‌లో (Armoor) మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ లేఆఫ్‌ను (NSF Factory Layoff) ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు ఇంకా రాలేదని వారు ఆయనకు విన్నవించారు. అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ (Congress Party) హామీ ఇచ్చిందని ఇప్పటివరకు అది నెరవేరలేదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాము భవిష్యత్తులో చేయబోయే ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడు అట్లూరి శ్రీనివాస్ మందకృష్ణను కోరారు. దీంతో మందకృష్ణ (Manda Krishna Madiga) సానుకూలంగా స్పందించారని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోసంగి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.