ePaper
More
    Homeఅంతర్జాతీయంMelody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. మోదీ, మెలోని సంభాషణ వీడియో వైరల్

    Melody | సోషల్ మీడియాలో మళ్లీ ‘మెలోడీ’.. మోదీ, మెలోని సంభాషణ వీడియో వైరల్

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Melody | కెనడాలో (Canada) జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన మాటామంతీ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. దీంతో ‘మెలోడీ’ (Melody) మూమెంట్ సోషల్ మీడియాలో (Social Media) మరోసారి ట్రెండింగ్ గా మారింది. కెనడాలో జరిగిన G7 సమ్మిట్(G7 summit)కు ప్రధాని మోదీ, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని (Italian Prime Minister Giorgia Meloni) హాజరయ్యారు. గ్రూప్ ఈ సందర్భంగా వారిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు.

    ఈ నేపథ్యంలో తీసిన ఫొటోను మెలోనీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దీనికి భారత్ – ఇటలీల (India and Italy) స్నేహబంధం దృఢంగా పెనవేసుకు పోయాయని రాసుకొచ్చారు. ఈ పోస్టుపై స్పందించిన ప్రధాని మోదీ (Prime Minister Modi).. మెలోనీ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నానని బదులిచ్చారు. ఈ స్నేహంతో ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరాలని ఆకాంక్షించారు. మోదీ, మెలోనీ దిగిన ఫొటోలు గతంలో తెగ వైరల్ అయ్యాయి. దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సదస్సు సందర్భంగా వీరిద్దరు సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని ‘ఎక్స్’లో పోస్టు చేసిన మెలోని.. మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అని హ్యాష్ ట్యాగ్ జత చేశారు. అప్పటి నుంచి మెలోడీ పదం ట్రెండింగ్(Trending)లో నిలిచింది.

    Melody | ‘యూ ఆర్ ది బెస్ట్..’

    మోదీ, మెలోనీ కలిసి ఉన్న వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇద్దరు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుని, శుభాకాంక్షలు తెలుపుకుంటున్న వీడియా ఆకట్టుకుంటోంది. మరోవైపు, మోదీని కలిసిన సందర్భంగా మెలోనీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అయ్యాయి. మోదీని ఉద్దేశించి ‘యూ ఆర్ ది బెస్ట్’ (‘You are the best’) అని పేర్కొన్నారు. మీలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

    More like this

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...