అక్షరటుడే, న్యూఢిల్లీ: Mehul Choksi | మన దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తిరిగి భారత్‌కు అప్పగించడానికి ఆంట్వెర్ప్‌లోని బెల్జియం కోర్టు Belgiam court సమ్మతించింది.
అయితే, చోక్సీ ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా, అప్పగింత ప్రక్రియలో ఈ తీర్పు కీలకమైన మొదటి అడుగుగా అధికారులు చెబుతున్నారు.
భారత్ కోరిక మేరకు ఏప్రిల్ 11, 2025న చోక్సీని ఆంట్వెర్ప్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను బెల్జియం జైలులోనే ఉన్నాడు. పారిపోయే ప్రమాదం ఉందని పలుమార్లు అతడి బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
భారత్‌లో చోక్సీపై నమోదైన కేసులు, నేరపూరిత కుట్ర, మోసం, సాక్ష్యాలను నాశనం చేయడం, అవినీతి నేరాలు.. బెల్జియం చట్టం ప్రకారం శిక్షార్హమైనవని కోర్టు గుర్తించింది.
Mehul Choksi | పలు సెక్షన్ల కింద కేసులు
భారత శిక్షాస్మృతిలోని 120B (నేరపూరిత కుట్ర), 201 (సాక్ష్యాలను మాయం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం), 420 (మోసం), 409 (నేరపూరిత నమ్మక ద్రోహం), 477A (పత్రాలను తప్పుగా మార్చడం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7 (లంచం), 13 (నేరపూరిత దుష్ప్రవర్తన) కింద భారత్‌లో చోక్సీపై అభియోగాలు ఉన్నాయి.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation – CBI) బృందం సాక్ష్యాలను సమర్పించడానికి మూడుసార్లు బెల్జియంను సందర్శించింది. ఈ ప్రక్రియలో సహాయం చేయడానికి ఒక యూరోపియన్ European లా ఫర్మ్‌ను నియమించింది.
చోక్సీని అప్పగిస్తే.. మానవీయ పరిస్థితుల్లో ఉంచుతామని బెల్జియం అధికారులకు భారత్ హామీ ఇచ్చింది. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న బ్యారక్ నంబరు 12లో ఉంచుతామని తెలిపింది.
ఇది యూరోపియన్ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది. ఈ సెల్ శుభ్రమైన నీరు, వార్తాపత్రికలు, ఆహారం, టెలివిజన్, వైద్య సదుపాయాలు కలిగి ఉందని వివరించింది.
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 14,356 కోట్ల కుంభకోణం
నవంబరు, 2017లో తాను ఆంటిగ్వా, బార్బుడా (Antigua , Barbuda) పౌరసత్వం పొందిన తర్వాత డిసెంబరు, 2018లో భారత పౌరసత్వాన్ని త్యజించాననే చోక్సీ వాదించాడు. కాగా, అతడి వాదనను భారత్ తోసిపుచ్చింది. భారత పౌరుడిగానే చోక్సీ ఉన్నాడని వివరించింది.
దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాలలో ఒకటైన రూ. 14,356 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank – PNB) మోసం కేసుకు సంబంధించి నీరవ్ మోదీ (Nirav Modi), అతడి మామ మెహుల్ చోక్సీ నిందితులు. 2011 – 2018 మధ్య కాలంలో మోసం, నేరపూరిత కుట్ర మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కేంద్ర సంస్థలు Central agencies మెహుల్ చోక్సీపై అభియోగాలు చేశాయి. దీంతో 2018 ఆరంభంలో చోక్సీ భారత్ నుంచి పారిపోయాడు.
1 comment
[…] ప్రస్తుతం అమెరికా America నుంచి యూరప్ (Europe) నకు వ్యాపించింది. ట్రంప్ Donald Trump […]
Comments are closed.