HomeUncategorizedRaja Raghuvanshi | మేఘాల‌య మ‌ర్డ‌ర్.. సోనమ్‌కు 119 కాల్స్‌ చేసిన సంజయ్‌ వర్మ

Raja Raghuvanshi | మేఘాల‌య మ‌ర్డ‌ర్.. సోనమ్‌కు 119 కాల్స్‌ చేసిన సంజయ్‌ వర్మ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raja Raghuvanshi | మేఘాలయకు హనీమూన్​కు సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా భార్య సోనమే ప్రియుడు రాజ్ కుశ్వాహా కోసం భర్తను హత్య చేయించింది. సుపారీ ఇచ్చిన నిందితులు చంపుతున్నప్పుడు ఆమె కూడా పక్కనే ఉండగా.. వారు లోయలో పడేస్తుంటే సాయం కూడా చేసింది. ఇది విని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే తాజాగా ఈ కేసు విష‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర అంశం వెలుగులోకి వ‌చ్చింది. కొత్త‌ వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సంజయ్ వర్మ(Sanjay Varma) అనే వ్యక్తితో సోనమ్.. 119 సార్లు ఫోన్ కాల్ మాట్లాడినట్లు తేలింది. ఈ కాల్స్ వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి, అసలు అతడు ఎవరనేది తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Raja Raghuvanshi | ఎవ‌రికి అన్ని కాల్స్..

సోనమ్ రఘువంశీ కాల్ డేటాలో “సంజయ్ వర్మ” అనే వ్యక్తితో అత్యధికంగా మాట్లాడినట్లు తేలగా, ఆ వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. తాజాగా పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. సంజయ్ వర్మ మరెవరో కాదు సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానేనని(Raj Kushwaha) నిర్ధారించారు.ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకే రాజ్ కుశ్వాహా మొబైల్ నంబర్‌ను “సంజయ్ వర్మ” పేరుతో సోనమ్ సేవ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీ(Raja Raghuvanshi)తో వివాహానికి ముందు, ఆ తర్వాత కూడా సోనమ్, సంజయ్ వర్మ అలియాస్ రాజ్ కుశ్వాహాలు ఫోన్ లో మాట్లాడుకున్నారని, 39 రోజుల వ్యవధిలో 234 సార్లు ఫోన్ చేసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ స్విచ్ఛాఫ్ ఉంది. ఈ హత్యకు రాజ్ కుశ్వాహానే పథకం రచించాడని పోలీసులు(Meghalaya Police) స్పష్టం చేశారు.

మార్చి 1 నుంచి 25 తేదీల మధ్య సోనమ్‌, సంజయ్‌ వర్మ ఈ కాల్స్‌ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం సంజయ్‌ వర్మ ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉంది. ఈ క్రమంలో రాజా రఘువంశీ హత్య కేసులో సంజయ్‌ వర్మ ప్రమేయం ఏమైనా ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి వివరాలు తెలుసుకోవడానికి నిందితులను విచారిస్తున్నామని చెప్పారు. కాగా ఈ కేసులో సోనమ్‌ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నార్కో టెస్టు చేయాలని ఇటీవల మృతుడి సోదరుడు పోలీసులను కోరాడు.కాగా, “సంజయ్ వర్మ” Sanjya Varma గురించి తనకు తెలియదని సోనమ్ సోదరుడు గోవింద్ తెలిపారు. “ఈ కేసులో సంజయ్ పేరు కూడా వస్తోందని ఇవాళే తెలిసింది” అని ఆయన అన్నారు. కాగా, కిరాయి హంతకులు ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మీలను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 11న సోనమ్ తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది.