అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mana Shankaravaraprasad Garu | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (director Anil Ravipudi) తెరకెక్కిస్తున్నారు. కాగా.. విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) ఒక ముఖ్య అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ ‘ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ..’ లిరీకల్ వీడియోను రిలీజ్ చేసింది.
Mana Shankaravaraprasad Garu | ఆకట్టుకుంటున్న సాంగ్..
తాజాగా విడుదల చేసిన లిరీకల్ సాంగ్‌ను ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’గా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. “ఏంటి బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి.., ఏంటి వెంకీ సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి..” అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటను ప్రముఖ గీతరచయిత కాసర్ల శ్యామ్ రాశారు. ఈ సాంగ్‌లోని లిరిక్స్ సంక్రాంతి పండుగను ముందుగానే తీసుకువచ్చాయి.
Mana Shankaravaraprasad Garu | ఉర్రూతలూగించిన చిరూ, వెంకీ
ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ తమదైన శైలి డాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ మాస్ ట్యూన్ సంక్రాంతి సీజన్‌కు (Sankranthi season) రానున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీపై మరింత హైప్ పెంచింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మాణమవుతోంది. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
