Health Camp
Health Camp | రేపు శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో మెగా వైద్యశిబిరం

అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్​ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలంగాణ యువజన కాంగ్రెస్​ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి (Ramarthi Gopi) తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. శివాజీనగర్ (Shivaji nagar)​ మున్నూరుకాపు సంఘంలో ఆదివారం ఉదయం 8 గంటలకు వైద్యశిబిరం ప్రారంభమవుతుందన్నారు.

ఇందులో భాగంగా ఉచితంగా రక్తపరీక్షలు (Blood test), ఈసీజీ (ECG), డాక్టర్​ కన్సల్టేషన్​, షుగర్​ పరీక్షలు చేస్తారని వివరించారు. అవసరమైన వారికి మందులు సైతం ఉచితంగా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

జనరల్​ ఫిజీషియన్​ విశ్వతేజ, గుండె వైద్య నిపుణులు రవికిరణ్​, ఆర్థోపెడిక్​ సర్జన్​ హర్షవర్ధన్​ గౌడ్​, సర్టికల్​ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్​ రాహుల్​ సామల, ప్రసూతి వైద్య నిపుణులు శైలజ, పిల్లల వైద్యుడు అశ్విన్​, దంతవైద్యురాలు శిరీష శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన వివరించారు. వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.