అక్షరటుడే, కోటగిరి: Health Camp | మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘంలో (Gangaputra Sangam) ఆదివారం మెగావైద్య శిబిరం నిర్వహించారు. బోధన్‌కు చెందిన అమృత ట్రూ లైసెన్స్ ఆస్పత్రి (Amrutha True License Hospital) ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేయగా.. మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్ రావు హాజరై ప్రారంభించారు.
తెల్ల రవన్న యువసేన, బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు ఎంవిఎస్ సుధాకర్, జనరల్ ఫిజీషియన్ షేక్ షావలి, పీడియాట్రిక్ వైద్యులు విఘ్నేశ్వర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. లయన్స్ కమిటీ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. సుమారు 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి మందులు అందజేశారు.
కార్యక్రమంలో మోరే కిషన్, సమీర్, శ్యాంసుందర్ గౌడ్, శంకర్ గౌడ్, నజీర్, సంతోష్, అరుణ్ గౌడ్, చిన్న అరవింద్, గౌతమ్, గంగాప్రసాద్, యోగేష్, మహేష్ రెడ్డి,రుద్రాంగి సందీప్, డాన్ రాజు, మేత్రి గంగాధర్, రహీం, దామరంచ సంతోష్, వర్షిత్, బుట్టి సాయి, తేజ, అర్పిత్, వడ్ల ఉమాకాంత్, వల్లభాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు హనుమంతరావు, పెద్ద కాపు శ్రీకాంత్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సాయిలు, కాముట్ల సాయిలు, మస్కుల గంగారాం, పుష్కల సాయిలు, మాస్కుల సాయిలు, తదితరులు పాల్గొన్నారు.