అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Health Camp | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సోమాజిగూడలో సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో ఈ నెల 18న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ (Redcross) సొసైటీ, డిసేబుల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్ – పిట్టి ట్రస్ట్, డాక్టర్ నారి చారిటబుల్ ట్రస్ట్, రవి హీలియోస్ హాస్పిటల్, వికలాంగుల నెట్‌వర్క్, వికలాంగుల హక్కుల సాధన సమితి, ఎఫ్‌ఈడీ, జనజాగృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు.
శిబిరంలో దివ్యాంగులకు ఉచిత శస్త్రచికిత్సలు చేస్తారు. సాధారణ వైద్య పరీక్షలు, డయాగ్నోస్టిక్ టెస్టులు, కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు, క్యాలిపర్స్, వీల్‌చైర్స్, ఎలక్ట్రిక్ మోటార్ వాహనాలను పంపిణీ చేస్తారు. ఈ వైద్య శిబిరాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం వైద్య శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ భీమ్‌రెడ్డి గారు, డిసేబుల్ ట్రస్ట్ సీఈవో విజయ్ భాస్కర్, కీర్తన యాదవ్( నారి ఫౌండేషన్), నల్గొండ శ్రీనివాస్, కిరణ్ గుత్తికొండ తదితరులు పాల్గొన్నారు.