అక్షరటుడే, వెబ్‌డెస్క్ : OG Movie | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ఓజీ’ యాక్షన్‌తో, ఫ్యాన్ ఫీవర్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. నిన్న రాత్రి ప్రారంభమైన ప్రీమియర్ షోలతోనే ఈ సినిమా బజ్ ఒక్కసారిగా పీక్స్‌కు వెళ్లింది. సినీప్రియులే కాదు, ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఈ సినిమాని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రత్యేకంగా హైదరాబాద్ (Hyderabad) శ్రీరాములు థియేటర్లో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ (Varun Tej and Sai Dharam Tej) సినిమా చూడడానికి అభిమానుల మధ్యకు రావడం హైలైట్‌గా నిలిచింది. తమ మామయ్య పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్లలో వారు కూడా అభిమానుల్లా మారి కాగితాలు ఎగరేసి, చప్పట్లతో థియేటర్‌ను హోరెత్తించారు. హీరోల హోదాను పక్కన పెట్టి నిజమైన ఫ్యాన్స్‌గా మారి ‘ఓజీ’ని ఎంజాయ్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
OG Movie | ఓజీ మానియా..
వీరితో పాటు, దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) కూడా థియేటర్‌కి హాజరయ్యారు. అభిమానులతో కలిసి సినిమా చూడడమే కాకుండా, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను విపరీతంగా ఎంజాయ్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా (Akira), కూతురు ఆద్య కూడా తమ తండ్రి సినిమాని చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇక మూవీ విషయానికి వస్తే దర్శకుడు సుజీత్ టేకింగ్, థమన్ అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ స్టైల్, పవర్, యాటిట్యూడ్ – అన్నీ కలిసి మరోసారి ఆయన మాస్ ఇమేజ్ను పీక్స్‌కి తీసుకెళ్లాయని అంటున్నారు.
ఇప్పటికే మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ (House Full) బోర్డులతో బిజీగా మారాయి. పండుగలా మారిన బాక్సాఫీస్ వద్ద ‘ఓజీ’ సినిమా ఆడియెన్స్‌కు ఉత్సాహాన్ని, ఫ్యాన్స్‌కు గర్వాన్ని అందిస్తోంది. రానున్న రోజులలో పవర్ స్టార్ దూకుడు బాక్సాఫీస్‌ను ఎలా ఊపేస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా మెగా ఫ్యాన్స్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.