HomeసినిమాOG Movie | ‘ఓజీ’ స్పెషల్ స్క్రీనింగ్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌తో...

OG Movie | ‘ఓజీ’ స్పెషల్ స్క్రీనింగ్‌లో మెగా ఫ్యామిలీ సందడి.. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి సినిమా చూసిన ప‌వ‌న్

అక్షరటుడే, హైదరాబాద్​: OG Movie | పవర్ స్టార్ Power Star పవన్ కళ్యాణ్ Pawan Kalyan తాజా చిత్రం ‘ఓజీ’ OG బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రాణిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగలా మారింది.

పవర్‌ఫుల్ యాక్షన్, స్టైలిష్ ప్రజెంటేషన్, థమన్ Thaman అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మెగా ఫ్యామిలీ కోసం ఓజీ చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.

సోమవారం (సెప్టెంబరు 29) సాయంత్రం జరిగిన ఈ స్పెషల్ షోకి మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi, ఆయన సతీమణి సురేఖ Surekha, పవన్ కళ్యాణ్ Pawan Kalyan, రామ్ చరణ్ Ram Charan, వరుణ్ తేజ్ Varun Tej, సాయి ధరమ్ తేజ్ Sai Dharam Tej, పంజా వైష్ణవ్ తేజ్Panja Vaishnav Tej, పవన్ కుమారుడు అకీరా నందన్ Akira Nandan, కుమార్తె ఆద్య Aadya తో పాటు చిరంజీవి మనవరాళ్లు హాజరయ్యారు.

OG Movie | మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట‌..

ఈ స్క్రీనింగ్‌కి చిత్ర బృందం కూడా హాజరై సందడి చేసింది. డైరెక్టర్ సుజీత్ Director Sujeeth, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ music director Thaman, నటులు అడివి శేష్ actors Adivi Sesh, రాహుల్ రవీంద్రన్ Rahul Ravindran కూడా మెగా ఫ్యామిలీతో కలిసి సినిమాను వీక్షించారు. సినిమా పూర్తయ్యాక చిరంజీవి Chiranjeevi, రామ్ చరణ్‌లు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించగా.. ఆ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

థియేటర్ నుంచి బయటికొచ్చే సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించగా, అభిమానులు ఆ వీడియోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఒకేచోట చేరి సినిమా చూసిన దృశ్యాలు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం ‘ఓజీ’ మంచి కలెక్షన్లు సాధిస్తూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మెగా ఫ్యామిలీ స్పెషల్ షో మరింత హైప్ క్రియేట్ చేస్తూ సినిమాపై బజ్‌ను పెంచింది.

ఓజీ చిత్రాన్ని సుజీత్ తెర‌కెక్కించగా, ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న ప్రియాంక మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. థ‌మ‌న్ SS Thaman సంగీతం అందించారు.

రెండు వంద‌ల కోట్ల‌కి పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఓజీకి పెద్ద‌గా పోటీ ఇచ్చే చిత్రాలు ఏవి లేక‌పోవ‌డంతో మూవీ దూసుకుపోతోంది.

Must Read
Related News