HomeUncategorizedVishwambhara | చిరు బ‌ర్త్ డే స్పెష‌ల్.. గ్లింప్స్ అద్దిరిపోయింది అంతే..!

Vishwambhara | చిరు బ‌ర్త్ డే స్పెష‌ల్.. గ్లింప్స్ అద్దిరిపోయింది అంతే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vishwambhara | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న చిత్రం విశ్వంభ‌ర‌. ఈ చిత్రాన్ని వ‌శిష్ట తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ మూవీని 2026 వేసవిలో విడుదల చేస్తామన్నదిగా అధికారికంగా ప్రకటించారు.

విజువల్ ఎఫెక్ట్స్ (visual effects) విషయంలో రాజీపడకుండా, ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో గతంలో ప్రచారంలో ఉన్న అక్టోబర్ లేదా డిసెంబర్ రిలీజ్ ఊహాగానాలకు పూర్తిగా చెక్ పడినట్లయింది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Vishwambhara | గ్లింప్స్ అదిరింది..

చిరంజీవి కెరీర్‌లో అంజి (Anji Movie) వంటి చిత్రమే ఇప్పటివరకు నిర్మాణంలో ఎక్కువ స‌మ‌యం తీసుకున్న‌ సినిమాగా గుర్తింపు పొందింది. సుమారు ఆరు సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉంది. 2004లో విడుదలైన ఈ సినిమా గ్రాఫిక్స్ (Movie graphics) విషయంలో ఏ మాత్రం రాజీ ప‌డ‌లేదు. అందుకే అంత ఆస‌ల్యం అయింది.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అత్యధిక అంచనాలతో థియేటర్లలోకి వచ్చి ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా, అందులోని విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ఇప్పటికీ ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రత్యేకించి క్లైమాక్స్‌లోని శివలింగం సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ కలిగించేలా ఉంటుంది.

ఇప్పుడు విశ్వంభ‌ర (Vishwambhara) కూడా చాలా స‌మ‌యం తీసుకుంటుంది. అయితే చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా కొద్ది సేప‌టి క్రితం గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు మూవీపై అంచ‌నాలు పెంచాయి. ముఖ్యంగా గ్లింప్స్ చివ‌ర‌లో చిరు చేతిలో ఉన్న బాల్ మాదిరి జంతువు క‌ళ్లు అటు ఇటు తిప్ప‌డం ఆస‌క్తిని క‌లిగించింది. గ‌తంలో వీఎఫ్ఎక్స్ విష‌యంలో విమ‌ర్శ‌లు రావ‌డంతో ఇప్పుడు చాలా జాగ్ర‌త్త ప‌డ్డారు. యుద్ధం కార‌ణంగా అణ‌గారిపోతున్న వ‌ర్గాన్ని ఆదుకునే వీరుడి మాదిరిగా ఇందులో చిరుని చూపించారు. టీజ‌ర్‌ని Teaser మాస్ యాక్ష‌న్ క‌ట్‌గా చూపించారు. ఇది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింద‌నే చెప్పాలి. ఇక రేపు 11.45కి మెగా 157 మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ రానుంది.