Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | పోక్సో, అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లింపుపై సమావేశం

Nizamabad Collector | పోక్సో, అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లింపుపై సమావేశం

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad Collector | పోక్సో (POCSO), అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లింపు ఖరారు కోసం సోమవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణా రెడ్డి (Collector Vinay Krishna Reddy) అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పోక్సో, అట్రాసిటీ బాధితుల పరిహారం కోసం నమోదై అర్హత కలిగిన 86 కేసుల్లో బాధితుల వివరాలను సమావేశంలో వివరించారు. బాధితులకు మహిళా శిశు సంక్షేమ శాఖ (Women and Child Welfare Department) ఆధ్వర్యంలో అందించే సేవలపై చర్చించారు. అనంతరం పరిహారం చెల్లింపును ఆమోదించారు. సమావేశంలో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya), డీఆర్‌డీవో సాయగౌడ్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీఈవో అశోక్, డీడబ్లువో రసూల్‌ బీ, తదితరులు పాల్గొన్నారు.