అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan Padayatra | కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర (In-charge Meenakshi Natarajan Padayatra) ఆర్మూర్‌లో ప్రారంభమైంది. శనివారం సాయంత్రం ఆమె ఆర్మూర్‌కు చేరుకున్నారు. ముందుగా ఆలూర్ బైపాస్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.
అనంతరం మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. పాదయాత్ర ఆలూరు బైపాస్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరిస్తూ.. సమస్యలు వింటూ ముందుకు సాగారు. పాదయాత్ర పెద్ద బజార్, గోల్ బంగ్లా, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ చౌరస్తా వరకు సాగనుంది. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, మదన్ మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు, కార్పొరేషన్ ఛైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, కాసుల బాలరాజ్, కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.