Meenakshi Natarajan padayatra
Meenakshi Natarajan padayatra | మీనాక్షి నటరాజన్ పాదయాత్ర.. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan padayatra | తెలంగాణ కాంగ్రెస్ ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను (BRS leaders) పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేశారు. నాయకులను శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని ఆర్మూర్ పోలీస్ స్టేషన్​కు (Armoor police station) తరలించారు. అనంతరం వారిని మాక్లూర్​కు తరలించినట్లు సమాచారం. కాగా.. ముందస్తు అరెస్టులను బీఆర్​ఎస్​ నాయకులు తీవ్రంగా ఖండించారు. అరెస్టయిన వారిలో పార్టీ పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ నర్మే నవీన్, మాజీ సర్వ సమాజ్ అధ్యక్షుడు గుండేటి మహేష్ రెడ్డి, ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు జన్నాపల్లి రంజిత్, సీనియర్ నాయకులు నచ్చు చిన్న రెడ్డి ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (in-charge Meenakshi Natarajan) నేడు ఆర్మూర్​ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం శ్రమదానంలో పాల్గొంటారు. అనంతరం పార్టీ కార్యకర్తలు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్​ఎస్​ నాయకులు పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేశారు.