అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆర్మూర్‌లో పర్యటిస్తున్నారు.
పట్టణానికి శనివారం చేరుకున్న ఆమె కార్యకర్తలతో కలిసి జెండా గల్లీ, గోల్‌బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రాత్రి సీ కన్వెన్షన్ హాల్లో బస చేశారు. కాగా.. ఆదివారం ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆమె కార్యకర్తలతో కలిసి శ్రమదానం నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు.
కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (manala Mohan reddy), నిజామాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Seethakka), మాజీ ఎంపీ మధుయాష్కీ (madhu yashki), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat), ఆర్మూర్, బాల్కొండ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్, కాంగ్రెస్ ఆలూరు మండలాధ్యక్షుడు ముక్కెర విజయ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.