అక్షరటుడే ఆర్మూర్: Meenakshi Natarajan | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర (Janahitha Padayatra) శనివారం ఆర్మూర్‌కు (Armoor) చేరుకోనుంది. నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమై గగ్గుపల్లి (gaggupally), ఇస్సాపల్లి గ్రామాల మీదుగా ఆర్మూర్ పట్టణానికి చేరుకుంటుంది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగనుంది. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలపై వినతులను ఆమె స్వీకరించనున్నారు.
Meenakshi Natarajan | ఆర్మూర్‌లోనే బస..
పాదయాత్ర అనంతరం పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని సీ కన్వెన్షన్ హాల్లో మీనాక్షి నటరాజన్ బస చేయనున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో గల గురుకుల కళాశాలలో శ్రమదానం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆర్మూర్ పట్టణ శివారులోని యమునా ఫంక్షన్ హాల్లో జరిగే ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొంటారు.
Meenakshi Natarajan | హాజరుకానున్న ముఖ్య నాయకులు..
ఆర్మూర్‌లో జరిగే పాదయాత్రకు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పీసీసీ చీఫ్ (PCC Chief) మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Incharge Minister Seethakka), ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, ఆర్మూర్, బాల్కొండ నియోజవర్గ ఇన్ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు నాయకులు పాల్గొననున్నారు.
Meenakshi Natarajan | శ్రమదానం స్థల పరిశీలన. ..
పట్టణంలోని పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోశ్రమదాన స్థలాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మొక్కలు నాటనున్నందున పరిసరాలను పరిశీలించినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు.
మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేయనున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వినయ్‌రెడ్డి తదితరులు