ePaper
More
    HomeతెలంగాణCabinet expansion | మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చేనా.. హైదరాబాద్ చేరుకున్న మీనాక్షి నటరాజన్

    Cabinet expansion | మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చేనా.. హైదరాబాద్ చేరుకున్న మీనాక్షి నటరాజన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cabinet expansion | కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​ హైదరాబాద్​ చేరుకున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion) అంశంపై ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ (PCC Chief Mahesh Goud) ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​(KC Venugopal)తో సమావేశం అయ్యారు. మంత్రివర్గ విస్తరణతో పాటు, రాష్ట్ర కార్యవర్గ పోస్టుల భర్తీపై వారు చర్చించారు. అయితే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతీసారి ఎవరో ఒకరు నిరసన గళం వినిపిస్తున్నారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో మీనాక్షి నటరాజన్​ హైదరాబాద్​ చేరుకున్నారు.

    Cabinet expansion | తీవ్రంగా పోటీ

    ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ పదువుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. మంత్రివర్గం ఉమ్మడి నిజామాబాద్​(nizamabad), ఆదిలాబాద్​(Adilabad) జిల్లాలకు ప్రాతినిద్యం లేదు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలు ఇతర అన్ని కోణాలను పరిశీలించి హైకమాండ్​ మంత్రి పదువులను భర్తీ చేయాలని చూస్తోంది. అయితే పలువురు నేతలు మాత్రం మంత్రి పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు.

    ఈ క్రమంలో హైదరాబాద్​ చేరుకున్న మీనాక్షి నటరాజన్​ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి నేతలతో ఆమె సమావేశం నిర్వహిస్తారు. రేపు మిగతా వారితో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

    Cabinet expansion | భేటీ కానున్న మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు

    హైదరాబాద్​ చేరుకున్న మీనాక్షి నటరాజన్​ను మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నేడు కలవనున్నారు. మంత్రి వర్గంలో తమకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నలుగురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే.

    మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఖాయం అనే వార్తలు వస్తుండటంతో వారు అప్రమత్తం అయ్యారు. సంఖ్యా బలాన్ని బట్టి తమకు పదవులు కేటాయించాలని వారు కోరుతున్నారు. అంతేగాకుండా నామినేటేడ్​ పదవులు, ఎంపీ సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని వారు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వీరందరిని మీనాక్షి నటరాజన్​ ఎలా బుజ్జగిస్తారనేది తెలియాల్సి ఉంది. వీరిని బుజ్జగించి మంత్రివర్గ విస్తరణ చేపడుతారా.. లేదంటే వీరి డిమాండ్ల నేపథ్యంలో మరోసారి వాయిదా వేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

    Cabinet expansion | డిమాండ్​ కాదు.. రిక్వెస్ట్​

    మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది డిమాండ్ కాదన, రిక్వెస్టని జుక్కల్​ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (Jukkal MLA Laxmi Kantarao) అన్నారు. నిన్న రహస్యంగా భేటీ అయిన ఎమ్మెల్యేలలో ఈయన కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ 18శాతం మాదిగలు ఉన్నారని తెలిపారు. తమ సంఖ్యా బలాన్ని బట్టి మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsihma)కు అనుభవం దృష్ట్యా మంత్రి పదవి వచ్చిందన్నారు. దానిని సామాజిక వర్గం కోణంలో చూడొద్దని పేర్కొన్నారు. మాదిగలు ఎప్పుడు కాంగ్రెస్​ పక్షానే ఉన్నారని ఆయన తెలిపారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...