HomeసినిమాNC24 | ఆర్కియాల‌జిస్ట్‌గా ద‌క్ష‌.. తాజా పోస్ట‌ర్‌తో అంద‌రిలో పెరిగిన ఆస‌క్తి

NC24 | ఆర్కియాల‌జిస్ట్‌గా ద‌క్ష‌.. తాజా పోస్ట‌ర్‌తో అంద‌రిలో పెరిగిన ఆస‌క్తి

నాగ చైత‌న్య‌, కార్తిక్ వ‌ర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న‌ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవగా, అభిమానులు మాత్రం “వృషకర్మ” టైటిల్‌పై అధికారిక ధృవీకరణ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NC24 | అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్‌గా ‘NC24’ అని నిర్ణయించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నాగచైతన్య (Naga Chaitanya) ఇప్పటివరకూ కనిపించని ఒక కొత్త యాంగిల్‌లో కనిపించ‌నున్నాడు.డివోషనల్ టచ్ ఉన్న థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, స్పెషల్ వీడియోలు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.‘NC24’లో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఆమె లుక్‌ను రివీల్ చేసింది.

NC24 | లుక్ అదిరింది..

ఈ సినిమాలో మీనాక్షి ‘దక్ష’ అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పురాతన గుహలో అరుదైన రాయిని పరిశీలిస్తున్న సమయంలో ఆమె కనిపించే సీన్‌ను షేర్ చేశారు మేకర్స్. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నాగచైతన్య పాత్ర కూడా అంతే ఆసక్తికరంగా ఉంది. సినిమాలో ఆయన ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించబోతున్నారు. హీరో హీరోయిన్ల పాత్రల లుక్స్ చూసి ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌లో చైతన్య ఇది తొలి ప్రయత్నం కావడంతో అభిమానుల్లో మరింత కుతూహలం నెలకొంది.

ఇక ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌ (Annapurna Studios)లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొండలు, లోయలు, గుహల వాతావరణంలో జరిగే ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (Producer BVSN Prasad) నిర్మిస్తున్నారు. మిస్టరీ, డివోషన్, యాక్షన్ కలగలిపిన ఈ కథకు చక్కని విజువల్ ట్రీట్ ఇవ్వాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే మూవీ టైటిల్, టీజర్‌పై అధికారిక అప్డేట్ రానుంది.