అక్షరటుడే, వెబ్‌డెస్క్: Meenakshi Chaudhary | టాలీవుడ్లో తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ కథానాయికల్లో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ముందంజలో నిలుస్తోంది. అందం, అభినయం, గ్లామర్‌కు సమతుల్యం కలిపి, గ్లామర్ పాత్రలతో పాటు కథకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుంటూ కెరీర్ ముందుకు తీసుకెళ్తున్న ఈ హర్యానా బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇప్పటికే వరుస ఇండస్ట్రీ హిట్లతో తన మార్క్ వేసుకున్న మీనాక్షి, వచ్చే ఏడాది కూడా సంక్రాంతి పండుగకే (Sankranthi festival) కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండడం ఆమె కెరీర్లో కీలక మలుపుగా మారింది. నవీన్ పోలిశెట్టి సరసన ఆమె నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే అక్కినేని నాగచైతన్యతో (Akkineni Naga Chaitanya) కలిసి ‘వృషకర్మ’ సినిమాలోనూ ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు మీనాక్షి స్టార్‌డమ్‌ను మరింత పెంచుతాయనే అంచనాలు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
Meenakshi Chaudhary | సాఫీగా మొదలుకాని ప్రయాణం..
మీనాక్షి చౌదరి సినీ ప్రయాణం మొదట్లో అంత సాఫీగా సాగలేదు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమెకు తొలి సినిమా భారీ విజయాన్ని అందించకపోయినా, నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అదే ఆమెకు అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్–2’లో HIt 2 అవకాశం తీసుకొచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మీనాక్షి కెరీర్ ఒక్కసారిగా ట్రాక్‌లోకి వచ్చింది.అనంతరం ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలు ఆమె ఖాతాలో భారీ విజయాలుగా నిలిచాయి. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో మీనాక్షి క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది.
ఇప్పుడు టాలీవుడ్లో ‘సంక్రాంతి బ్యూటీ’గా మీనాక్షికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. గత రెండు సంక్రాంతుల్లో ఆమె నటించిన సినిమాలు బ్లాక్బస్టర్లుగా నిలవడం విశేషం. గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’ భారీ వసూళ్లు సాధించగా.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ బలంగా కలిసి వస్తోందన్న టాక్ వినిపిస్తోంది. 2026 పొంగల్ రేసులో నయనతార (Nayanatara), నిధి అగర్వాల్, పూజా హెగ్డే, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్లు పోటీ పడుతున్నా, సంక్రాంతి సెంటిమెంట్ పరంగా మీనాక్షి ముందంజలో ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.
అయితే అదే సమయంలో ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ సినిమాలు విడుదల కానుండడంతో ‘అనగనగా ఒక రాజు’ ఏ స్థాయిలో నిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఇటీవల మీనాక్షి చౌదరి గురించి హీరో సుశాంత్‌తో పెళ్లి అన్న రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై మీనాక్షి టీమ్ స్పష్టత ఇచ్చింది. అవన్నీ కేవలం పుకార్లేనని, ఏ విషయాన్నైనా అధికారికంగా ప్రకటించే వరకు నమ్మొద్దని వెల్లడించింది. ప్రస్తుతం మీనాక్షి పూర్తిగా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టిందని, రూమర్స్‌కు సినిమాలతోనే సమాధానం ఇస్తోందని పేర్కొంది.