అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sushanth-Meenakshi | యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ, ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేసి ఈ మూవీతోనూ మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. అయితే అంతకుముందు కొన్ని సినిమాల్లో కనిపించినా, సరైన బ్రేక్ రాలేదు. కానీ గుంటూరు కారం తర్వాత ఆమెకు ఆఫర్లు వెత్తుతున్నాయి. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో నటించిన ‘లక్కీ భాస్కర్’ కూడా హిట్ కొట్టింది. ఈ విజయాలతో మీనాక్షికు టాలీవుడ్‌లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
Sushanth-Meenakshi | మళ్లీ దొరికారుగా..
తాజాగా.. మరో భారీ ప్రాజెక్ట్ ఆమె ఖాతాలో పడిందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలో మీనాక్షి కీలక పాత్రలో నటించనుంది. ఆమె ఈ సినిమాలో దేవకన్య పాత్రలో కనిపించనుందని టాక్. ఇదిలా ఉంటే, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా సమయంలో అక్కినేని హీరో సుశాంత్‌తో (Akkineni Hero Sushanth) ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆమె డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం ఈ వార్తలకు మరింత బలమిస్తోంది.
ఇద్దరు కూడా చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటూ నడుస్తోన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని కామెంట్ చేస్తున్నారు. వీడియోలో మీనాక్షి చౌదరి తన ముఖానికి మాస్క్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్‌తో దర్శనమివ్వగా.. సుశాంత్ లగేజ్ ట్రాలీతో పాటు మరో బ్యాగ్ చేత్తో పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి గురించి మళ్లీ నెట్టింట చర్చ మొదలైంది. మరి ఇప్పుడైనా ఈ జంట తమ మధ్యనున్న రిలేషన్ గురించి మరోసారి క్లారిటీ ఇస్తారా..లేక గతంలో మాదిరిగానే సైలెంట్‌గా ఉంటారా అనేది చూడాలి.