అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Film Actress Poonam Kaur | ధ్యానంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ (Film Actress Poonam Kaur) అన్నారు. నగరంలోని నాందేవ్వాడలో ఉన్న బ్రహ్మకుమారీస్ సంస్థలో(Nizamabad Brahma Kumaris organization) శుక్రవారం ధ్యానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ధ్యానం చేయడం వల్ల శాంతిగా ఉండవచ్చన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు సంఘీభావంగా ప్రజలంతా ధ్యానం చేయాలని సూచించారు. పహల్గామ్లో (Pahalgam terror attack) ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల ముందే తన కశ్మీర్ పర్యటన రద్దయిందన్నారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఇన్ఛార్జి సునీత బెహన్జీ, జ్యోతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.