HomeతెలంగాణHyderabad | మేడిపల్లి స్వాతి హత్య కేసు.. తల పడేయడానికి ఇటుకలు.. కాళ్లు పడేసేందుకు పది...

Hyderabad | మేడిపల్లి స్వాతి హత్య కేసు.. తల పడేయడానికి ఇటుకలు.. కాళ్లు పడేసేందుకు పది కిలోల రాయి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | బాలాజీహిల్స్‌లోని (Balaji Hills) మేడిపల్లి జరిగిన గర్భిణి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. భార్య స్వాతిని హత్య చేసిన మహేందర్ రెడ్డి అనుమానాస్పద ప్రవర్తనతో పోలీసులు చేప‌ట్టిన‌ విచారణ చివరకు అతని నిజస్వరూపాన్ని బయటపెట్టింది.

మహేందర్ రెడ్డి – స్వాతి దంపతులు వివాహేతర సంబంధాల పట్ల అనుమానాలతో తరచూ గొడవ పడుతున్నట్టు సమాచారం. అయితే మ‌హేంద‌ర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్న క్ర‌మంలో అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మహేందర్ రెడ్డి ముందుగానే హాక్సా బ్లేడ్ కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. ఇంట్లో గొడవ తర్వాత, అత్యంత హీనంగా భార్యను హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేశాడు.

Hyderabad | సంచ‌ల‌న విష‌యాలు..

చెత్త తీసుకెళ్లే బ్లాక్ కవర్లల్లో కాళ్లు, చేతులు, తల విడివిడిగా ప్యాక్ చేశాడు. ఆ త‌ర్వాత ఇంటిపై ఉన్న ఇటుక‌లు తీసుకొచ్చి త‌ల‌కి తాడుతో క‌ట్టాడు. అందుకు సంబంధించిన క‌వ‌ర్‌ని బ్యాగ్‌లో వేశాడు. మరోవైపు చేతులు వేసిన క‌వ‌ర్‌ని బ‌స్తాలో వేసి బైక్‌పై పెట్టుకున్నాడు. ఇక ఈ రెండు కవర్లను ప్రతాపసింగారం వద్ద ఉన్న మూసీ న‌దిలో ప‌డేశాడు. ఇక రెండు కాళ్లను ప‌ది కిలోల‌ రాయికి కట్టి.. యూరియా బస్తాలో మూట కట్టి వాటిని కూడా మూసీలో వేశాడు. ఆ త‌ర్వాత స్వాతి మొబైల్ తీసుకుని.. స్వాతి చెల్లి శ్వేతకు తిన్నారా అని మెసేజ్ చేసి, స్వాతినే మెసేజ్ చేసిన‌ట్టు డ్రామా ఆడాడు. ఆ త‌ర్వాత మేడిపల్లి(Medipalli)లోని ఓ పాన్ షాప్ దగ్గర ఆగి.. సిగరెట్ తాగుతూ.. తన చెల్లికి ఫోన్ చేసి స్వాతి గొడ‌వ‌ప‌డి ఇంటి నుండి వెళ్లిపోయింద‌ని చెప్పాడు.

ఇక స్వాతి మొండేన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్న స‌మయంలో నిందితుడు బంధువు గోవర్ధన్ రెడ్డి వచ్చి.. స్వాతి ఎక్కడికి వెళ్లిందని అడిగాడు. అనంత‌రం ఇద్దరూ కలిసి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో (Medipalli Police Station) స్వాతి అదృశ్యం అయిందంటూ ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు.. మీ ఇద్ద‌రికి ఏమైనా గొడవ జరిగిందా.. నువ్వేమైనా చేశావా.. అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు వేశారు.

దీంతో భయపడిన మహేందర్ రెడ్డి .. నా భార్యను నేనే హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దాంతో శనివారం అర్ధరాత్రి తరువాత అత‌నిని అదుపులోకి తీసుకోగా, స్వాతి శరీర భాగాలు ఎక్కడ పారవేశావో చూపించ‌మ‌ని అంటే.. సర్ నిద్ర వస్తోంద‌ని చెప్పాడు.. అయితే, స్వాతి శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతోంది. స్వాతి మృతదేహంలోని మొండేనికి పోస్టుమార్టం చేసి అనంతరం కుటుంబానికి అప్పగించారు. నిందితుడు మహేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు (Cherlapalli Jail) రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.