Homeజిల్లాలుకామారెడ్డిGandhari Mandal | రామనామస్మరణతో మార్మోగిన మేడిపల్లి

Gandhari Mandal | రామనామస్మరణతో మార్మోగిన మేడిపల్లి

గాంధారి మండలంలోని మేడిపల్లి గ్రామంలో కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల రామ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.

- Advertisement -

అక్షర టుడే, గాంధారి: Gandhari Mandal | మండలంలోని మేడిపల్లి గ్రామంలో (Medipalli village) కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రాముడి విగ్రహంతో (Lord Ram Statue) వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఊరేగింపు సందర్భంగా రామ నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీరాముని కరసేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామచంద్రుడి ఆశీర్వాదాలు ఎప్పుడు తమ గ్రామంపై ఉండాలని గ్రామస్థులు వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.