అక్షరటుడే, ఇందూరు: AYUSH Department | ఆరోగ్య పరిరక్షణలో ఔషధ మొక్కల (Medicinal plants) పాత్ర కీలకమని, వాటిని నాటి సంరక్షించుకోవాలని ఆయుష్ విభాగం జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ గంగాదాసు అన్నారు. నగరంలోని అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం (Arsapalli Urban Health Center) ఆశా కార్యకర్తలతో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయుష్ వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులకు మంచి ఫలితాలుంటాయని, ప్రతి ఒక్కరూ ఔషధ గుణాలున్న మొక్కలను నాటి పరిరక్షించాలని సూచించారు.
అనంతరం యోగా (Yoga) వైద్యుడు తిరుపతి మాట్లాడుతూ.. యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చని, గర్భిణులు యోగా సాధనతో సాధారణ ప్రసవం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అజ్మత్ ఉన్నిసా, ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమా ప్రసాద్, హెచ్‌ఈవో గిరిధర్, రాణి, వెంకటేష్, ఏఎన్‌ఎంలు, యోగా శిక్షకులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
