Medical Students Ground Demand | క్రీడామైదానం కోసం జూడాల డిమాండ్​.. జీజీహెచ్​లో నిరసన​

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Medical Students Ground Demand | శాశ్వత క్రీడామైదానం ఏర్పాటు చేయాలని జూనియర్​ డాక్టర్లు (JUDA Protest) డిమాండ్​ చేశారు. ఈ మేరకు జీజీహెచ్​లో(Government General Hospital) జూనియర్ డాక్టర్స్​ అసోసియేషన్ (JUDA) నిజామాబాద్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. Medical Students Ground Demand | కళాశాల స్థాపించి 13ఏళ్లు పూర్తయినప్పటికీ.. నగరంలో (Nizamabad News) మెడికల్​ కళాశాల ఏర్పాటై 13ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత క్రీడామైదానం(Sports […]

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Medical Students Ground Demand | శాశ్వత క్రీడామైదానం ఏర్పాటు చేయాలని జూనియర్​ డాక్టర్లు (JUDA Protest) డిమాండ్​ చేశారు. ఈ మేరకు జీజీహెచ్​లో(Government General Hospital) జూనియర్ డాక్టర్స్​ అసోసియేషన్ (JUDA) నిజామాబాద్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Medical Students Ground Demand | కళాశాల స్థాపించి 13ఏళ్లు పూర్తయినప్పటికీ..

నగరంలో (Nizamabad News) మెడికల్​ కళాశాల ఏర్పాటై 13ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత క్రీడామైదానం(Sports Ground Demand) లేకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా జూడాలు పేర్కొన్నారు. ప్రాథమిక వసతులలో భాగమైన కాలేజీ గ్రౌండ్ లేకపోవడం విద్యార్థుల విద్యా, క్రీడా, వ్యక్తిత్వాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు.

ఒత్తిడితో కూడిన విద్య..

మెడికల్ విద్య అనేది ఒత్తిడితో కూడిన కోర్సు అని జూడాలు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీడామైదానం లేకపోవడంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం (Mental Health)పై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. శారీరక వ్యాయామం, క్రీడా కార్యకలాపాలు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించి మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి అత్యంత అవసరమని వారు వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత కాలేజీ గ్రౌండ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూడాల అసోసియేషన్​ (Junior Doctors Association) అధ్యక్షుడు కార్తిక్ కొమ్మనబోయిన, జనరల్ సెక్రెటరీ జయంత్, వైస్ ప్రెసిడెంట్స్​ సంతోష్, చంద్రకాంత్, వక్వార్, హేమంత్, రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Assistant Professors Terminated | మెడికల్ కళాశాలలో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల తొలగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీఎంఈ

నగరంలోని మెడికల్ కళాశాలలో ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్యవిధాన పరిషత్​ కొరడా ఝలిపించింది. ఈ సందర్భంగా ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.

Basara IIIT Student | బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్​ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్​...

KTR on Mallanna Jathara | దైవ దర్శనానికి వెళ్తే దాడి చేస్తారా : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Mallanna Jathara | నాగర్​ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న (Kummera Mallanna) జాతరలో...

Saudi Poultry Import Ban | సౌదీ కీలక నిర్ణయం.. భారత్​ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ సహా 40 దేశాల...