అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Team | హైదరాబాద్(Hyderabad) నగరంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. చాలా మంది వీటి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ వైద్య కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులు(Medical College Students) సైతం గంజాయికి బానిసలు మారారు. తాజాగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను ఉన్నత విద్య నిమిత్తం మహా నగరానికి పంపిస్తున్నారు. ఇక్కడే హాస్టళ్లు, రూముల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే పలువురు విద్యార్థులు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ పిల్లలు చదువుకుంటున్నారని ఇంటి దగ్గర తల్లిదండ్రులు భావిస్తుండగా.. వీరు మాత్రం వ్యసనాలకు అలవాటు ఆరోగ్యాలు పాటు చేసుకుంటున్నారు.
Eagle Team | రిసాలబజార్ కేంద్రంగా..
హైదరాబాద్‌లోని రిసాలబజార్ కేంద్రం(Risal Bazaar Center)గా కొంతకాలంగా గంజాయి దందా సాగుతోంది. నగరంలో గంజాయి, డ్రగ్స్ అరికట్టడానికి ఈగల్ టీమ్(Eagle Team )చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రిసాల బజార్ కేంద్రంగా సాగుతున్న దందాపై ఈగల్ టీమ్ సభ్యులు దాడి చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారితో పాటు, వాటిని తీసుకుంటున్న 81 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో ఓ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులు(Medical Students) ఉండటం గమనార్హం.
Eagle Team | బైక్‌పై వచ్చి విక్రయం
బొల్లారం రిసాలబజార్‌లో గల ఓ పాఠశాల గ్రౌండ్‌కు తరచూ ఓ యువకుడు బైక్ వచ్చి గంజాయి విక్రయించేవాడు. ఈ మేరకు ఈగల్ టీమ్‌కు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి నిందితుడు అరాఫత్ అహ్మద్ ఖాన్(23)ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక(Karnataka)లోని బీదర్‌లో జరీనా బాను అనే మహిళ వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Eagle Team | 9 మందికి పాజిటివ్
అరాఫత్ వద్ద 100 మంది గంజాయి కొనుగోలు చేసినట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ఇందులో ఓ మెడికల్ కాలేజీకి చెందిన 32 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మందికి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేయగా.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది. వీరు కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఇందులో ఇద్దరు యువతులు కూడా ఉండటం గమనార్హం. 9 మంది విద్యార్థులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి డీ-అడిక్షన్ సెంటర్(De Addiction Center)కు తరలించారు.