- Advertisement -
HomeతెలంగాణDattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

Dattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori ) నియమితులయ్యారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి బ్రాకీథెరపీ, రేడియోధార్మిక ఇంప్లాంటేషన్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్​ నివారణ, నియంత్రణ కోసం సలహాదారుగా నియమించింది.

- Advertisement -

కాగా కృష్ణా జిల్లా (Krishna District)కు చెందిన దత్తాత్రేయుడు రేడియేషన్​ అంకాలజిస్ట్ (Radiation Oncologist)​గా పేరు ప్రఖ్యాతలు సాధించారు. అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం క్యాన్సర్ విభాగానికి అధికారిగా పని చేస్తున్నారు.

అయితే 2025 మార్చి 13న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయనను సలహాదారుగా నియమించింది. ఆయన రెండేళ్లు ఆ పదవిలో కొనసాగుతారని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనను సలహాదారుగా నియమించడం గమనార్హం.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News