అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amagi Media Labs Limited IPO | అమాగి మీడియా ల్యాబ్స్ (Amagi Media Labs) క్లౌడ్ ఆధారిత మీడియా టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందింది. దీనిని 2008లో బెంగళూరు (Bengalore)లో స్థాపించారు. ఈ కంపెనీ బ్రాడ్‌కాస్ట్ టీవీ, కనెక్టెడ్ టీవీ, ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ టీవీ మరియు ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్‌ల కోసం క్లౌడ్ నేటివ్ పరిష్కారాలను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది.
సంప్రదాయ హార్డ్‌వేర్ ఆధారిత మౌలిక సదుపాయాల నుంచి సౌకర్యవంతమైన, సమర్థవంతమైన క్లౌడ్ ఆధారిత కార్యకలాపాలకు మారడానికి ప్రసారకులు మరియు కంటెంట్ యజమానులకు సహాయపడుతుంది. ఈ కంపెనీ ఐపీవో (IPO) ద్వారా 1,789 కోట్లను సమీకరించనుంది. ఇందులో రూ. 816 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్. ఐపీవో ద్వారా సమకూరిన నిధులను టెక్నాలజీ మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి కోసం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఆర్థిక వివరాలు..
కంపెనీ 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ.942.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,223.31 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో నష్టాలు(Loss) రూ. 245 కోట్లనుంచి రూ. 68.71 కోట్లకు తగ్గాయి. ఆస్తులు 1,308.08 కోట్లనుంచి రూ. 1,425 కోట్లకు పెరిగాయి.
ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 361గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 41 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం రూ. 14,801తో దరఖాస్తు చేసుకోవాలి. గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్మాల్ హెచ్‌ఎన్‌ఐ కేటగిరిలో 14 నుంచి 67 లాట్ల వరకు బిడ్ వేయవచ్చు. బిగ్ హెచ్‌ఎన్‌ఐ కేటగిరిలో కనీసం 68 లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 75 శాతం, హెచ్‌ఎన్‌ఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా కేటాయించారు. కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 55 ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 15 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని జీఎంపీ సూచిస్తోంది.
ముఖ్యమైన తేదీలు..
సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీ : జనవరి 13.
బిడ్డింగ్ ముగింపు తేదీ : జనవరి 16.
అలాట్‌మెంట్ వెల్లడి : జనవరి 19.
లిస్టింగ్ తేదీ : జనవరి 21 (బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.)