అక్షరటుడే, వెబ్డెస్క్: Medaram Jathara | రాష్ట్రంలో రెండేళ్లకు ఓ సారి జరిగే మేడారం జాతరకు (Medaram Jatara) లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం దేశంలోని పలు ప్రాంతాల నుంచి గిరిజనులతో పాటు ఇతరులు సైతం పెద్ద ఎత్తున వస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తోంది. అయితే జాతీయ పండుగా ప్రకటించాలని ఏళ్లుగా డిమాండ్ ఉంది. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) స్పందించారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరని తెలిపారు. శనివారం ఆయన వరంగల్లో పర్యటించారు. హైదరాబాద్ నుంచి వందే భారత్ రైలులో (Vande Bharat train) వరంగల్ చేరుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ (Warangal Railway Station) అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని తెలిపారు. మేడారానికి కూడా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.
Medaram Jathara | వెయ్యి స్తంభాల గుడి సందర్శన
కిషన్రెడ్డి సెంట్రల్ ఆర్కాలజీ అధికారులతో కలిసి వెయ్యి స్తంభాల ఆలయాన్ని (Thousand Pillar Temple) సందర్శించారు. అభివృద్ధి పనులు ఆలస్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చామని వెల్లడించారు. భద్రాచలం ఆలయానికి రూ.50 కోట్లు, రామప్పకు రూ.150 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మేడారం జాతర విసయాన్ని కేంద్ర ట్రైబల్, టూరిజం మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.