అక్షరటుడే, హైదరాబాద్: Medak Collector | కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు Medak Collector Rahul Raju పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. సదరు కలెక్టర్‌కు జైలు శిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు కలెక్టర్‌కు 6 నెలల జైలుశిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది.
Medak Collector | అప్పీలుకు అవకాశం..
కాగా, తీర్పు అమలును హైకోర్టు నాలుగు వారాలపాటు నిలిపివేసింది. ఈ కేసులో అప్పీలు చేసుకునేందుకు కలెక్టర్‌కు హైకోర్టు 4 వారాల సమయం ఇచ్చింది. భూవివాదం కేసులో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టర్ పట్టించుకోలేదంటూ మెదక్ జిల్లాలోని బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన ధర్మాసనం ఈ మేరకు కలెక్టర్‌పై చర్యలకు ఉపక్రమించింది. దీంతోపాటు అప్పీలుకు సైతం అవకాశం ఇవ్వడం గమనార్హం.