అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | ఐరాడ్, ఈడార్లను విజయవంతంగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) వెల్లడించారు. నిజామాబాద్‌ను మోడల్ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
మన తెలంగాణ రాష్ట్రంలో ఐరాడ్, ఈడార్ ప్రాజెక్టును (IRAD and EDAR project) నిజామాబాద్ జిల్లాలో జులై 2021 నుండి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహణ, శిక్షణ, సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో పోలీస్ శాఖ (Police Department), రవాణా శాఖ (Transport Department), ఆరోగ్య శాఖ (Health Department), రహదారుల శాఖల సమస్వయంతో పనిచేస్తాయని తెలిపారు.
CP Sai chaitanya | వినూత్నరీతిలో ప్రచారం..
అవగాహన కార్యక్రమాలే కాకుండా వినూత్న రీతుల్లో ముందుకెళ్తూ ఆర్మూర్ జక్రాన్‌పల్లి, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ (Nizamabad Rural Police Stations) పరిధిలలో ప్రమాదాల నివారణకు డమ్మీ రోడ్డు ప్రమాద ప్రదర్శనను నిర్వహించినట్లు సీపీ చెప్పారు. ఈ ప్రాజెక్టులో నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు కూడా మొదలు పెట్టినప్పటికీ.. ఇందూరు జిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్తుందని సీపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలను (government departments) ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేశామన్నారు. దీని వల్ల ప్రప్రథమంగా ఐరాడ్, ఈడార్ అప్లికేషన్ ఉపయోగించి, అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించామని ఆయన తెలిపారు.
CP Sai chaitanya | రోడ్డుప్రమాదాలు జరగకుండా అవగాహన..
పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా.. దాదాపు 200 కన్నా ఎక్కువ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని సీపీ తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో 2021 నుండి ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.