అక్షరటుడే, భీమ్‌గల్: Limbadri Gutta | భీమ్‌గల్ శివారులోని శ్రీమన్నింబాచల క్షేత్రం లింబాద్రిగుట్టపై జాతర బ్రహ్మోత్సవాల (Brahmotsavam) నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. లింబాద్రిగుట్టపై ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి, భీమ్‌గల్ సర్వ సమాజ్ అధ్యక్షుడు నీలం రవి, ఎస్సై సందీప్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతేడాది కలిగిన ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయని.. ఈ ఏడాది సమస్య పునరావృతం కాకుండా ఒకే దిశలో వాహనాల రాకపోకలు (oneway system) జరిగేలా అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. లింబాద్రి గుట్టకు వచ్చే భక్తులు ప్రవేశ మార్గం (Entry Route) భీమ్‌గల్ నుంచి పురాణీపేట మీదుగా లింబాద్రిగుట్టకు వెళ్లనున్నారు. అలాగే నిష్క్రమించే మార్గం (Exit Route) లింబాద్రిగుట్ట నుంచి పల్లికొండ, లింగాపూర్, సిద్ధపల్లి మీదుగా భీమ్‌గల్ కు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.
అలాగే భారీ వాహనాల నిష్క్రమణం కోసం (heavy vehicles Exit) లింబాద్రిగుట్ట నుంచి పల్లికొండ పిప్రి, ముచ్కూర్, బెజ్జోర గ్రామాల మీదుగా భీమ్‌గల్‌కు చేరుకోవచ్చు. లింబాద్రి గుట్టకు వచ్చే భక్తులు పోలీసు శాఖ వారి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ జాతరను విజయవంతం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో వీడీసీ ఉపాధ్యక్షుడు బర్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

