అక్షరటుడే, నిజాంసాగర్: Mohammed Nagar | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని మహమ్మద్ నగర్ ఎంఈవో అమర్‌సింగ్ (MEO Amar Singh) అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో (ZP High School) మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు వారానికి మూడుసార్లు కోడిగుడ్డు అందించాలని, భోజనశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మధుసూదన్ రాజ్ పాల్గొన్నారు.
