ePaper
More
    HomeజాతీయంWest Bengal : నాలుగు రోజులకు ఒకసారి భోజనం.. రాడ్లతో దాడి.. అశ్లీల చిత్రాల్లో నటించనందుకు...

    West Bengal : నాలుగు రోజులకు ఒకసారి భోజనం.. రాడ్లతో దాడి.. అశ్లీల చిత్రాల్లో నటించనందుకు ఆరు నెలలుగా యువతిపై ఘాతుకం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: West Bengal : తల్లి అంటే మొదటి గురువు అంటారు.. పిల్లలకు ఆమె నేర్పిందే వేదం.. కానీ, ఆ తల్లి తన కుమారుడికి సెక్స్ రాకెట్(sex racket) పాఠాలు నేర్పింది. అమ్మాయిలను వలలో వేసుకోవడం, అశ్లీల చిత్రాల్లో నటించేలా యువతులను ప్రేరేపించడం పై శిక్షణ ఇచ్చింది. అలా ఆ తల్లి కుమారులు ఉద్యోగాల పేరుతో ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. వీరి బారిన పడిన ఓ అభాగ్యురాలు గత ఆరు నెలలుగా తీవ్రమైన చిత్రహింసలు అనుభవించి, ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో(West Bengal) వెలుగు చూసింది.

    అశ్లీల చిత్రాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఓ యువతిని ఆరు నెలల పాటు చిత్రహింసలకు గురిచేసిన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తల్లీ కుమారుడు శ్వేతాఖాన్ ఆర్యన్​ఖాన్ కలిసి ఓ యువతిని అధిక వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తామని ట్రాప్ చేశారు. అనంతరం అశ్లీల చిత్రాల్లో నటించాలని, బార్ డ్యాన్సర్ గా పని చేయాలని బలవంత పెట్టారు. అందుకు ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఓ ఫ్లాట్​లో బంధించి 6 నెలలుగా చిత్రహింసలకు గురిచేశారు. ఎట్టకేలకు బాధితురాలు వారి నుంచి అతి కష్టం మీద తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది.

    పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన తల్లీ కుమారులు శ్వేతాఖాన్, ఆర్యన్ ఖాన్ కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ముసుగులో అశ్లీల వీడియోల రాకెట్, దానికి సంబంధించిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నారు. వీరు ఎక్కువ జీతం ఆశ చూపి ఉద్యోగం పేరుతో నిరుద్యోగ యువతులను నమ్మించేవారు. అనంతరం ఆశ్లీల చిత్రాల్లో నటించాలని వారిని బలవంతం చేసేవారు. 6 నెలల క్రితం 24 ఉత్తర పరగణా జిల్లా(North 24 Parganas district)కు చెందిన ఓ అమ్మాయి ఉద్యోగం(JOB) కోసం ఫేస్​బుక్​(Facebook)లో ఆర్యన్​ఖాన్​ను సంప్రదించింది. హౌరాలోని తమ నివాసానికి వస్తే కొలువు ఇప్పిస్తామని అతడు నమ్మబలకడంతో ఆ యువతి వారి ఇంటికి వెళ్లింది.

    ఆర్యన్ అతడి తల్లి శ్వేతతో కలిసి ఆ యువతిని బార్ డాన్సర్(bar dancer) వృత్తి రొంపిలోకి దించడానికి ప్రయత్నించారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో యువతిపై దాడి చేశారు. ఆమె మొబైల్ లాక్కొని, బంధించారు. ఆరు నెలల పాటు ఆమెను ఇనుపరాడ్డుతో తీవ్రంగా కొడుతూ హింసించేవారు. నాలుగు రోజులకు ఒకసారే భోజనం పెట్టేవారు.

    బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం క్లిష్టంగా ఉండటంతో పోలీసులు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. వారు సెక్స్ రాకెట్ సైతం నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తు(investigation)లో వెల్లడైనట్లు తెలిపారు.

    Latest articles

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Srinagar Airport | ఆర్మీ అధికారి వీరంగం.. స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Srinagar Airport | ఓ ఆర్మీ అధికారి (Army Officer) రెచ్చిపోయాడు. ఎయిర్​పోర్టులో స్పైస్​...

    KCR | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్​ కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రంలో (KCR Farm House) బీఆర్​ఎస్​ నాయకులు...

    Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనది: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనదని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...

    More like this

    Ex Mla Jeevan reddy | జనహిత యాత్ర కాదు.. జనరహిత యాత్ర : మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan reddy | కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Srinagar Airport | ఆర్మీ అధికారి వీరంగం.. స్పైస్ జెట్ సిబ్బందిపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Srinagar Airport | ఓ ఆర్మీ అధికారి (Army Officer) రెచ్చిపోయాడు. ఎయిర్​పోర్టులో స్పైస్​...

    KCR | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్​ కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రంలో (KCR Farm House) బీఆర్​ఎస్​ నాయకులు...