అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఎండీఎం కార్మికుల బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు (AITUC District Working President Dubas Ramulu) డిమాండ్ చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం (Banswada Sub-Collector office) ముందు మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం రెండో రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మొత్తం బిల్లులు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు (mid-day meal workers) రూ.పది వేలు గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం హామీని మరిచిపోయిందని ఆయన దుయ్యబట్టారు. శిథిలావస్థలో ఉన్న వంటశాలలను నిర్మించాలని, వంట పాత్రలు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బాన్సువాడ డివిజన్ సెక్రెటరీ శంకర్, అంజవ్వ, సుజాత, నాగమణి, లక్ష్మి, నజిమాబి, చియా బేగం, సోఫియా బేగం, మంద శంకర్, సాయిలు, పాషా తదితరులు పాల్గొన్నారు.