HomeతెలంగాణMayor Vijayalakshmi | నీ అంతు చూస్తామంటూ మేయ‌ర్‌కి బెదిరింపులు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

Mayor Vijayalakshmi | నీ అంతు చూస్తామంటూ మేయ‌ర్‌కి బెదిరింపులు.. భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mayor Vijayalakshmi | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మికి (Mayor Gadwal Vijayalakshmi) ఫోన్‌లో బెదిరింపుల‌కు దిగ‌డం క‌ల‌క‌లం రేపింది. అర్ధరాత్రి స‌మ‌యంలో ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌ల (Voice Massage) ద్వారా ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడడం చ‌ర్చ‌నీయాంశం అయింది. గుర్తుతెలియని వ్యక్తి ఆమెతో పాటు ఆమె తండ్రి రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావును (Rajya Sabha member K. Kesava Rao) కూడా గాయపరుస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని నంబర్‌ నుంచి వాయిస్ కాల్స్ (Voice call) వచ్చాయి. ఆ వ్యక్తి అసభ్యంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

Mayor Vijayalakshmi | మేయ‌ర్‌కే బెదిరింపులా?

మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మిని (Mayor vijayalakshmi) ఆమె తండ్రిని కూడా హత్య చేస్తానంటూ వాయిస్ మెసేజ్‌లు పంపాడు. ఆ కాల్స్ చేసిన వ్యక్తి తనను ఇటీవల బోరబండలో ఆత్మహత్య చేసుకున్న సర్ధార్‌కు చెందినవాడినని చెప్పాడు. అయితే అసభ్య పదజాలంతో మేయర్‌ను తీవ్రంగా మానసికంగా వేధించాడు. రాజకీయ నాయకురాలిపై ఇటువంటి బెదిరింపులు రావడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పోలీసులు మేయర్‌కు వచ్చిన ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ చేసిన నంబర్‌ను ట్రేస్ (Number trace) చేయడానికి సాంకేతిక సహాయం తీసుకొని త్వరలోనే ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ (Arrest) చేస్తామని పోలీసులు వెల్లడించారు.

బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో మేయర్‌ భద్రతపై (Mayor Security) కూడా పరిశీలన ప్రారంభించారు. రాజకీయ నేతలపై (political leaders) ఇటువంటి బెదిరింపులు ఆగిపోవాలంటే, దుండగులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. పోలీసులు (Police) త్వరగా నిందితుడిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మేయర్ అనుచరులు ఆశిస్తున్నారు.