అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Mayor Election Preparations | నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) కార్యాలయాన్ని ఆదివారం సందర్శించారు.
Mayor Election Preparations | ఏర్పాట్లపై ఆరా..
స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సీపీ సందర్శించి అక్కడ జరుగుతన్న ఏర్పాట్లపై కమిషనర్ దిలీప్కుమార్తో(Commissioner Dilip Kumar) మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీష్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్లో 60 డివిజన్లు..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Municipal Corporation) పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికల్లో భాగంగా బీజేపీ 28 డివిజన్లను కైవసం చేసుకుని ఆధిక్యంలో నిలిచింది. అధికార కాంగ్రెస్పార్టీ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు దక్కించుకున్నాయి. ఒక స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 31కి బీజేపీ దూరం కావడంతో తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు అభ్యర్థుల వేటలో పడ్డాయి.