HomeతెలంగాణWalkathon | ప్రపంచ మధుమేహ దినోత్సవం–2025 సందర్భంగా మాక్సివిజన్ వాకథాన్

Walkathon | ప్రపంచ మధుమేహ దినోత్సవం–2025 సందర్భంగా మాక్సివిజన్ వాకథాన్

Walkathon | ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన వాకథాన్‌ను నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Walkathon | ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన వాకథాన్‌ను నిర్వహించారు.

పాఠశాల విద్యార్థులు, మాక్సివిజన్ వైద్యులు, ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. ముందస్తుగా గుర్తించడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ఈ వాకథాన్ ద్వారా అవగాహన కల్పించారు.

Walkathon | డయాబెటిక్ రెటినోపతి

మధుమేహం వలన కలిగే తీవ్రమైన సమస్యలు, ముఖ్యంగా పనిచేసే వయస్సు గల పెద్దలలో దృష్టి కోల్పోవడానికి ప్రధాన కారణమైన డయాబెటిక్ రెటినోపతి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ వాకథాన్ ప్రధాన లక్ష్యంగా వైద్యులు పేర్కొన్నారు.

మధుమేహం వల్ల కలిగే అంధత్వాన్ని నివారించడంలో సకాలంలో రోగ నిర్ధారణ, క్రమం తప్పకుండా కంటి పరీక్షల ప్రాముఖ్యాన్ని మాక్సివిజన్ వైద్యులు నొక్కిచెప్పారు.

జీవనశైలి వ్యాధులు, వాటి సమస్యలను పరిష్కరించడానికి ఆసుపత్రి చేపడుతున్న అవుట్రీచ్, అవగాహన ప్రచారాలు, స్క్రీనింగ్ క్యాంపుల ద్వారా ప్రయత్నాలను హైలైట్ చేశారు.

ఆరోగ్యకరమైన, మరింత అవగాహన ఉన్న సమాజాన్ని ప్రోత్సహించడం ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూ, సామూహిక సంకల్పంతో ఈ వాకథాన్​ను ముగించారు.

Must Read
Related News