More
    Homeమేడ్చల్ మల్కాజిగిరిMaxivision Eye Hospital | అందుబాటులోకి మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్.. అప్పటి వరకు...

    Maxivision Eye Hospital | అందుబాటులోకి మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్.. అప్పటి వరకు ఉచిత కన్సల్టెన్సీనే!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Maxivision Eye Hospital | నేత్ర వైద్య రంగంలో ప్రఖ్యాత సంస్థ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్, హైదరాబాద్​లో తన 13వ, దేశ వ్యాప్తంగా తీసుకుంటే 65వ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది.

    కొంపల్లి Kompally లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని మంగళవారం (సెప్టెంబరు 16) ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణ రాజు, మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, కో – ఛైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

    Maxivision Eye Hospital | అత్యాధునిక సదుపాయాలు..

    అందుబాటులోకి మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్.. అప్పటి వరకు ఉచిత కన్సల్టెన్సీనే!
    అందుబాటులోకి మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్.. అప్పటి వరకు ఉచిత కన్సల్టెన్సీనే!

    ఈ సందర్భంగా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణరాజు Andhra Pradesh Legislative Assembly Deputy Speaker Raghu Rama Krishna Raju మాట్లాడారు. హైదరాబాద్ Hyderabad ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు మరో నూతన జోడింపుగా ఈ కొత్త మైలురాయి హాస్పిటల్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

    అధిక-నాణ్యత ప్రమాణాలతో కూడిన కంటి సంరక్షణను స్థానికంగా మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలనేది మాక్సివిజన్ నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

    అత్యాధునిక సౌకర్యాలు, వైద్య నిపుణులు, రోగికి ప్రాధాన్యం అనే సిద్దాంతంతో భారతీయ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మాక్సివిజన్ పెంచుతోందని చెప్పుకొచ్చారు.

    ప్రతిష్ఠాత్మక Maxivision Super Specialty Eye Hospitals ​ను అందుబాటులోకి తెచ్చారంటూ.. డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డితోపాటు వైద్య బృందాన్ని అభినందించారు.

    మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు & కో – ఛైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి Maxivision Super Specialty Eye Hospitals Founder and Co-Chairman Dr. Kasu Prasad Reddy. మాట్లాడుతూ.. అసాధారణమైన కంటి సంరక్షణ అవకాశాలను విస్తరించాలనే తమ అచంచలమైన లక్ష్యం మేరకు తాజాగా కొంపల్లిలో ఆసుపత్రి కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

    ఈ కేంద్రంలో అధునాతన డయాగ్నస్టిక్ టెక్నాలజీలు, శస్త్రచికిత్సా యంత్రాలు ఉన్నట్లు తెలిపారు. నాణ్యత, స్థోమత విషయంలో రాజీ పడకుండానే ప్రతి వ్యక్తికి అందుబాటులో సేవలు అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు.

    క్లినికల్ ఆవిష్కరణ clinical innovation, కారుణ్య సేవ, మెరుగైన కంటి ఆరోగ్యం వైపు జాతీయ ఉద్యమాన్ని నడిపించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.

    కమ్యూనిటీ-ఫస్ట్ కార్యక్రమంలో బాగంగా కొంపల్లి మాక్సివిజన్​లో అక్టోబరు 31, 2025 వరకు ఉచిత కన్సల్టెన్సీ సౌకర్యం కల్పించింది. ఆప్టికల్ ఉత్పత్తులు, నగదు శస్త్రచికిత్సలపై కూడా 15% తగ్గింపును ప్రకటించింది.

    Maxivision Eye Hospital : అందుబాటులో ఉన్న చికిత్సలు..

    • కంటిశుక్లం శస్త్రచికిత్స (రోబోటిక్ సహాయంతో సహా)
    • లాసిక్, లేజర్ విజన్ కరెక్షన్
    • రెటీనా సేవలు
    • గ్లాకోమా చికిత్స
    • పీడియాట్రిక్ ఆప్తాల్మాలజీ
    • కార్నియల్ ట్రాన్స్ ప్లాంట్లు
    • ఆక్యులోప్లాస్టీ సేవలు

    More like this

    Birkur | గుడి డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తా: బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి (Telangana Tirumala Tirupathi) సంబంధించి రూ.25 లక్షలు...

    Stock Markets | వాణిజ్య చర్చలపై ఆశలు.. 82 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Markets | యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌(Trade deal) విషయమై జరుగుతున్న చర్చలు ఇన్వెస్టర్లలో ఆశలు...

    Collector Kamareddy | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

    అక్షరటుడే, గాంధారి: Collector Kamareddy | మండల కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ (Collector Ashish Sangwan) మంగళవారం...