అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Madhavi | తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Film Industry) ఎందరో అందాల తారలు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించారు. సావిత్రి తరం తరువాత వచ్చిన దాదాపు ప్రతి స్టార్ హీరోయిన్ కూడా చిరుతో జోడీ కట్టింది. మూడు తరాల నటీమణులతోనూ స్క్రీన్ షేర్ చేసిన హీరోగా చిరంజీవి పేరు నిలిచింది.
ఇటీవల సోషల్ మీడియాలో చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోయిన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో కనిపిస్తున్న ఆమె ఎవరో తెలుసా? అదే 1983లో విడుదలైన ఇండస్ట్రీ హిట్ ఖైదీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మాధవి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమాతో ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటించిన మాధవి (Actress Madhavi) అప్పటికే స్టార్ హీరోయిన్ అయినా, ఈ మూవీ ఆమెకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది.
Actress Madhavi | అదే అందం..
మాధవి – చిరంజీవి జంట అప్పట్లో అత్యంత పాపులర్ జోడీగా నిలిచింది. వీరి కాంబినేషన్‌లో ప్రాణం ఖరీదు, మనవూరి పాండవులు, కోతల రాయుడు, రోషగాడు, సింహపూరి సింహం, చట్టంతో పోరాటం, దొంగమొగుడు, బిగ్ బాస్ వంటి సినిమాలు వరుసగా హిట్లు సాధించాయి. తన కాలంలో మాధవి స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ సినిమా తర్వాత మాధవి సినీ రంగానికి గుడ్‌బై చెప్పేశారు. 1996లో అమెరికన్ వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట అమెరికాలోని న్యూజెర్సీలో (New Jersey) స్థిరపడి ఉన్నారు.
మాధవి, ఆమె భర్త ఫార్మా రంగంలో విజయవంతమైన వ్యాపారులు. అంతేకాదు, ఇప్పుడు ఆమె ఒక రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారని సమాచారం. ముగ్గురు కూతుళ్లతో కలిసి మాధవి కుటుంబం అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల మాధవి కుటుంబ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె సింపుల్ అండ్ గ్రేస్‌ఫుల్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “ఎప్పటికీ చిరస్మరణీయమైన నటి”, “చిరుతో ఆమె కెమిస్ట్రీ మిస్సవ్వలేనిది”, “ఇప్పటికీ రాణి లాంటి గ్లామర్” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మాధవి వందల కోట్ల ఆస్తుల యజమానిగా, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్‌తో అమెరికాలో జీవిస్తున్నట్లు తెలుస్తోంది.
