IPL 2025 | ఢిల్లీతో మ్యాచ్.. ఓడితే SRH ఇంటికే!
IPL 2025 | ఢిల్లీతో మ్యాచ్.. ఓడితే SRH ఇంటికే!

అక్షరటుడే, వెబ్​డెస్క్:IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మరో కీలక మ్యాచ్‌కు సిద్దమైంది. ఉప్పల్ వేదికగా ఈ రోజు(సోమవారం) రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.

ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 విజయాలు మాత్రమే నమోదు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచినా టోర్నీ(Tournament)లో ముందడుగు వేయలేని పరిస్థితి తెచ్చుకుంది. ఒకవేళ చివరి నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచినా 14 పాయింట్స్ మాత్రమే సన్‌రైజర్స్(Sunrisers) ఖాతాలో చేరుతాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడితే మాత్రం ఈ అవకాశం కూడా ఉండదు.

ముఖా ముఖి పోరులో ఢిల్లీ(Delhi)పై సన్‌రైజర్స్‌(Sunrisers) దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడగా.. సన్‌రైజర్స్ 13 గెలిచింది. ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్‌ ఆరంభంలో వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ ఓటమి ఆరెంజ్ ఆర్మీ(Orange Army)ని కోలుకోలేకుండా చేసింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారడంతో సన్‌రైజర్స్ పరువు కోసం పాకులాడుతోంది.

కనీసం అభిమానుల సంతోషం కోసమైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టోర్నీ(Tournament) ఆరంభంలో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ(Delhi).. అనూహ్యంగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. సన్‌రైజర్స్‌పై గెలిచి మళ్లీ టాప్-4లోకి దూసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. నేటి మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ కూడా నిష్క్రమిస్తుంది.