అక్షరటుడే, వెబ్‌డెస్క్: Transfers of ASP’s | తెలంగాణలో భారీ సంఖ్యలో అదనపు ఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ సెక్రటరీ (Special Secretary of Home Ministry) రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం అదనపు డీసీపీగా ఉన్న నరేశ్‌కుమార్‌ను జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) ఏఎస్పీగా(అడ్మిన్)గా బదిలీ చేశారు. అక్కడ ఉన్న కిషన్‌ను వరంగల్ ఏఎస్పీగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న ఉదయ్ రెడ్డి మాదాపూర్ (Madapur) అడిషనల్ డీసీపీగా.. అక్కడ పనిచేస్తున్న జయరాంను టీజీఐసీసీసీ (TGICCC) అదనపు ఎస్పీగా నియమించారు. మహమ్మద్ ఫజుల్ రహమాన్ ను అడిషనల్ డీసీపీ మేడ్చల్ నుంచి సీఐడీకి బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న విశ్వప్రసాద్ ను అడిషనల్ డీసీపీ(ఎస్వోటీ మేడ్చల్ జోన్)కు బదిలీ చేశారు.
Transfers of ASP’s | నల్గొండ ఏఎస్పీ(అడ్మిన్)గా గొల్ల రమేశ్..
వెయిటింగ్లో గొల్ల రమేశ్‌ను నల్గొండ ఏఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రాములునాయక్‌ను నిర్మల్ ఏఎస్పీగా బదిలీ చేశారు. హైదరాబాద్ సిటీ సీసీఎస్ అడిషనల్ డీసీపీగా ఉన్న రవీందర్‌రెడ్డిని సూర్యాపేట ఏఎస్పీ అడ్మిన్‌గా నియమించారు. అక్కడ కొనసాగుతున్న నాగేశ్వర్రావును డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. వెయిటింగ్లో ఉన్న చంద్రకాంత్‌ను సీఐడీ విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఉన్న లక్ష్మిని ఎల్బీ నగర్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా ట్రాన్స్ఫర్ చేశారు. మహమ్మద్ అష్వక్ ను అడిషనల్ డీసీపీ హైదరాబాద్ నుంచి అడిషనల్ డీసీపీ సీటీసీకి బదిలీ చేశారు. సీటీసీలో ఉన్న ఆనంద్‌ను సెంట్రల్ జోన్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.
Transfers of ASP’s | సెంట్రల్ జోన్లో పనిచేస్తున్న కృష్ణగౌడ్‌ను..
సెంట్రల్ జోన్లో పనిచేస్తున్న కృష్ణగౌడ్‌ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఏఎస్పీ(అడ్మిన్) రాములును హైదరాబాద్ ట్రాఫిక్‌కు (Hyderabad Traffic) బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న వి.రఘు ఇంటలిజెన్స్ విభాగానికి (Intelligence Department) ట్రాన్స్ఫర్ చేశారు. ఇంటలిజెన్స్‌లో ఉన్న గోవర్ధన్ వెస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీగా నియమించారు. ఆసిఫాబాద్ అదనపు ఎస్పీ(అడ్మిన్) ప్రభాకర్ రావ్‌ను వరంగల్ కమిషనరేట్ ఎల్ఎండ్వో, ట్రాఫిక్ అదనపు డీసీపీగా నియమించారు. వెయిటింగ్లో ఉన్న శ్రీకాంత్‌ను సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు.
Transfers of ASP’s | సిద్ధిపేట్ అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా కుషాల్కర్..
శ్రీనివాస్‌రావును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు (Vigilance and Enforcement), కుషాల్కర్ను సిద్ధిపేట్ అడిషనల్ డీసీపీ(అడ్మిన్)గా ట్రాన్స్ఫర్ చేశారు. నరేందర్‌ను భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) అడిషనల్ ఎస్పీగా బదిలీ చేశారు. వెంకట రమణ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కరీంనగర్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. పూర్ణచందర్ శంషాబాద్ అడిషనల్ డీసీపీగా నియమితులయ్యారు. శంషాబాద్ అడిషినల్ డీసీపీగా ఉన్న రాంకుమార్‌ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. వెయిటింగ్లో ఉన్న హన్మంత్ రావును సైబరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా, కొమ్మెర శ్రీనివాసరావ్‌ను రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీగా, ఎం సుదర్శన్‌ను అడిషనల్ డీసీపీ సీసీఎస్, ఈవో డబ్ల్యూకు, శ్యాంప్రసాద్‌రావు సీఐడీ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు.